- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్‌టైం రికార్డు… సెంచరీకి చేరువలో డీజిల్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ సెంచరీ దాటింది. కాగా డీజిల్ కూడా సెంచరీకి చేరువలో ఉంది. గత పదిరోజుల్లో మూడు సార్లు పెట్రోల్‌ధరలు పెరగగా.. డీజిల్ ధర ఆరుసార్లు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరకోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు పెరిగాయి. దీంతో వాహనదారుల్లో వణుకు మొదలైంది. వాహనాలు బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతూ పోతే బతికేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఆ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై పడుతోంది.
వాహనాలు మనిషి జీవితంలో ఒక నిత్యావసరంగా మారిపోయాయి. ఈ గల్లీ లోంచి పక్క గల్లీలోకి వెళ్లాలన్నా సరే బైక్, కారు వినియోగించే రోజులివి. కాగా దేశవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుంతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే మూడుసార్లు పెట్రోల్ ధరలు పెరగడమే ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్ 27వ తేదీన తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.26గా ఉంటే.. 28న రూ.0.22 పైసలు పెంచగా రూ.105.48కి చేరింది. ఒకే ఒక్క రోజు స్థిరంగా ఉన్న ఆ ధర సెప్టెంబర్ 30 నాటికి రూ.0.26 పైసలు పెరిగి రూ.105.74 కు చేరింది. మరుసటి రోజు శుక్రవారం కూడా రూ.0.26 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. రూ.106కు చేరుకుంది. ఇలా నాలుగు రోజుల వ్యవధిలోనే మూడుసార్లు అంటే మొత్తం కలిసి రూ.0.74 పైసలు పెరగడంతో సామాన్యుడికి మరింత భారంగా మారింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. దీనివల్ల అనునిత్యం పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక డీజిల్ విషయానికొస్తే గత పది రోజుల వ్యవధిలో ఆరుసార్లు ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 22న లీటర్ డీజిల్ ధర రూ.96.69 పైసలుగా ఉంటే అక్టోబర్1వ తేదీ నాటికి రూ.98.39 పైసలకు చేరుకుంది. ఏకంగా ఇది రూ.1.70 పైసలు పెరిగింది. ఈ ఏడాది జూన్‌లోనే పెట్రోల్సెంచరీ మార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే దారిలో డీజిల్ కూడా సెంచరీ మార్క్‌కు దగ్గరలో చేరింది.
మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో శుక్రవారం పెంచిన ధరల ప్రకారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106కు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.98.39కు చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.48, డీజిల్ ధర రూ.98.84కు చేరుకుంది. వరంగల్‌లో పెట్రోల్ రూ.105.95, డీజిల్ రూ.98.33గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ రూ.106.45, డీజిల్ రూ.98.80, ఖమ్మంలో పెట్రోల్ రూ.106.22, డీజిల్ రూ.98.50, మెదక్‌లో లీటర్ పెట్రోల్ రూ.106.14, లీటర్ డీజిల్ ధర రూ.99.08పైసలకు చేరుకుంది.
- Tags
- disel