- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్ హెల్ప్ మీ.. అంధకారంలో యువకుడు.. దాతల కోసం ఎదురుచూపులు
దిశ, కామేపల్లి: తల్లిదండ్రులు, ఆరోగ్యస్థితి సరిగా లేక అంధకారంలో జీవిస్తున్నాడు ఓ యువకుడు. రెండు కిడ్నీలు పనిచేయక వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోలేక తీవ్రమైన ఇబ్బందితో బాధపడుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని జాస్తిపల్లి గ్రామానికి చెందిన సగ్గుర్తి. దుర్గయ్య (రాజేంద్రప్రసాద్) గత ఎనిమిది సంవత్సరాల నుండి రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రంగా బాధ పడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోవడంతో అన్న వద్ద ఉంటూ దాతల సహాయం కోరుతూ వేడుకుంటున్నాడు.
ప్రభుత్వం, దాతలు సహకరించి తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నాడు. కిడ్నీ మార్పిడి చేయాలంటే లక్షల రుపాయలు ఖర్చు అవుతుందని నిరుపేద కుటుంబం కావడంతో అనారోగ్య సమస్యతో జీవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ముందుకు వచ్చి తన కిడ్నీల మార్పిడికి ఏర్పాటు చేసేలా కృషి చేయాలని తాను వేడుకుంటున్నాడు. సహాయం చేయదలచిన దాతలు 9505 256173నెంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నాడు.