టీమ్ ఇండియాకు ‘ధోనీ’ విలువైన ఆస్తి : వసీం జాఫర్

by Shamantha N |
టీమ్ ఇండియాకు ‘ధోనీ’ విలువైన ఆస్తి : వసీం జాఫర్
X

టీమ్ ఇండియాకు ‘మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విలువైన ఆస్తి’ అని ఇటీవలే అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్ చేశాడు. ‘ఒకవేళ ధోనీ కనుక ఫిట్‌నెస్ సాధించి, ఫుల్ ఫామ్‌లో ఉంటే అతడిని తప్ప వేరే వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని తెలిపాడు. వికెట్ల వెనుక, లోయర్ ఆర్డర్‌లో ధోనీ ఎంతో విలువైన ఆటగాడు’ అని వసీం ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

ధోనీని ఆడించడం వల్ల కేఎల్ రాహుల్‌పై భారం తగ్గడమే కాకుండా.. రిషబ్ పంత్‌ను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా ఉపయోగించుకునే వీలుంటుందని జాఫర్ సూచించాడు. వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎంఎస్ ధోనీ ఇంత వరకు టీమ్ ఇండియా తరపున ఆడని విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ప్రదర్శన ద్వారా అతడిని టీ20 ప్రపంచకప్‌లో ఎంపిక చేస్తామని కోచ్, సెలెక్టర్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ భవిత్యమే ప్రశ్నార్థకంగా మారింది.

Tags : MS Dhoni, Wasim Jaffer, KL Rahul, Rishabh pant, Team India

Advertisement

Next Story