- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో రెండేళ్లు ధోనీనే కెప్టెన్ : సీఎస్కే
దిశ, స్పోర్ట్స్: ఎంఎస్ ధోని ఇటీవలే తన 40వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. నాలుగు దశాబ్దాల వయసు నిండటంతో ఇకపై ధోనీ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెబుతాడంటూ వార్తలు వచ్చాయి. గత ఏడాది ఐపీఎల్ సమయంలో కూడా ఇకపై మీరు పసుపు రంగు జెర్సీలో కనపడరా అని ప్రశ్నించగా.. కచ్చితంగా కాదు అని అన్ని రూమర్లకు చెక్ పెట్టాడు. అయితే తాజాగా రిటెన్షన్ నిబంధన విధించడం, ధోనీ వయసు మీద పడుతుండటంతో అతడు కచ్చితంగా ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెబుతాడనే వార్తలు మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ రూమర్లకు చెక్ పెట్టారు.
మహేంద్ర సింగ్ ధోనీ మరో రెండేళ్ల పాటు సీఎస్కే తరపున ఆడతాడని తేల్చి చెప్పారు. ‘ధోనీ మరో రెండేళ్లు జట్టుతో ఉంటాడు. అతడు పూర్తి ఫిట్‌గా ఉండటంతో పాటు కఠిన మైన సాధన చేస్తున్నాడు. అతడు సీఎస్కేకు చేసిన సేవకు మేం చాలా సంతోషంగా ఉన్నాము.అతడి కెప్టెన్సీ ఒక్కటి మాత్రమే కాదు. ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్ జట్టుతో ఉండటం వల్ల మిగిలిన వారికి స్పూర్తిగా ఉంటుంది’ అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ధోనీ ప్రపంచ క్రికెట్‌లో అత్యత్తమ ఫినిషర్. ప్రస్తుతం సీఎస్కేకు కూడా అనే పనిచేస్తున్నాడని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.