ఈనెల 9న ఇందిరా పార్క్ వద్ద ధర్నా : డీటీఎఫ్

by Sridhar Babu |
DTF1
X

దిశ, పరకాల: విద్య, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించబడాలంటే పోరాటాలే శరణ్యమని డీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి కె. బిక్షపతి అన్నారు. ఈనెల 9న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నా కర పత్రాలను పరకాల ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ.. ఉద్యోగుల నాలుగు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేవన్నారు. పాఠశాలల ఖాళీలను భర్తీ చేయడంలేదని, విద్యావాలంటీర్ల నియమాకాలు లేవన్నారు.

గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బదిలీలు, పదోన్నతులు చేపడుతామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. పండితుల పదోన్నతుల ఉత్తర్వులు అమలు కావడం లేదన్నారు. బోధనేతర సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని, పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. ఈనెల 9న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడా డీటీఫ్ సభ్యులు వెంకటేశ్వర్ రావు, కె బిక్షపతి, పి నర్సయ్య, సి హెచ్ నర్సయ్య, సి హెచ్ అశోక్, కిషన్, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed