Panchajanya Shankham : పాంచజన్య శంఖం అంటే ఏమిటి.. దీన్ని ఇంట్లో పెట్టుకోవాలా వద్దా ?

by Sumithra |
Panchajanya Shankham : పాంచజన్య శంఖం అంటే ఏమిటి.. దీన్ని ఇంట్లో పెట్టుకోవాలా వద్దా ?
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : హిందూ మతంలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇది సాధారణంగా ఇళ్లలో కనిపిస్తుంది. పూజ సమయంలో వీటిని ఉపయోగిస్తారు. శంఖాల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే వాటిలో పాంచజన్య శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ శంఖం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తుంది. దీని ధ్వని అత్యంత శక్తివంతమైనది, శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. అయితే పాంచజన్య శంఖం అంటే ఏమిటి, దాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పాంచజన్య కథ..

పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పాంచజన్య అనే రాక్షసుడిని చంపి పాంచజన్య శంఖాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి పాంచజన్య అని పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అదే శంఖాన్ని ఊది సైనికుల మనోధైర్యాన్ని పెంచాడని పురాణం. అయితే అది తమ ఇంట్లో ఉంచుకోవచ్చా అనేది చాలా మంది మదిలో వచ్చే ప్రశ్న.

పాంచజన్య శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ?

పాంచజన్య శంఖాన్ని ఇంట్లో ఉంచవచ్చు ఎందుకంటే శంఖం పవిత్రమైనదంటున్నారు పండితులు. అయితే దానిని ఉంచే దిశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. వాస్తు ప్రకారం శంఖాన్ని ఎల్లప్పుడూ ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలని చెబుతున్నారు. మీరు ఇంట్లో పాంచజన్య శంఖాన్ని ఉంచినట్లయితే, భక్తితో, ఆచారాలతో పూజించిన తర్వాత మాత్రమే దానిని ఉంచాలంటున్నారు పండితులు.

పాంచజన్య శంఖం ప్రాముఖ్యత..

పాంచజన్య శంఖాన్ని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఇది అత్యంత పవిత్రమైన శంఖంగా చెబుతున్నారు పండితులు. కాబట్టి, దీనిని ఊదడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని చెబుతున్నారు. మీ ఇంట్లో కలహాలు ఉంటే ఈ శంఖాన్ని తప్పనిసరిగా ఉంచాలంటున్నారు వేదపండితులు.

దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కుటుంబ వివాదాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ శంఖం శ్రీకృష్ణుడితో ముడిపడి ఉందని భావిస్తారు. అందువల్ల పాంచజన్య శంఖాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా, శ్రీ హరి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుందని నమ్ముతారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.

Advertisement

Next Story

Most Viewed