- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దసరా ఎఫెక్ట్: దుర్గమ్మ భక్తులకు మంత్రి శుభవార్త
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ సమీపిస్తోన్న వేళ దుర్గమ్మ భక్తులకు మంత్రి కొట్టు సత్యనారాయణ శుభవార్త చెప్పారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మవారి దర్శనం విషయంలో సామాన్యులకే పెద్దపీట వేస్తామని అన్నారు. అమ్మవారి దర్శనానికి సీఎం జగన్ వచ్చే సమయంలో కేవలం 40 నిమిషాల పాటు దర్శనాలు నిలిపేస్తామని ప్రకటించారు. మిగతా సమయమంతా సామాన్య ప్రజలు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సామాన్య ప్రజల మాదిరే దర్శనం చేసుకోవాలని సూచించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే వీఐపీలను కట్టడి చేశామని, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా సామాన్య భక్తుల మాదిరే దర్శనం చేసుకోవాలని కోరారు.
Advertisement
Next Story