మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేసుకోరో తెలుసా?

by Jakkula Samataha |
మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేసుకోరో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఏ శుభకార్యం చేయాలన్నా సరే ముహుర్తాలు చూస్తుంటాం. పెళ్లి, బారసాలల కోసం పండితులను అడిగి,మంచి సమయం చూసి ఫంక్షన్స్ చేసుకుంటాం. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఆగస్టు ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు8 వరకు మూడు నెలలు మూఢం ఉంటుంది. అయితే మూఢం అనగానే చాలామంది భయపడిపోతుంటారు. ఆ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోరు. కాగా, అసలు మూఢం అంటే ఏమిటి? మూఢంలో ఏ శుభకార్యాలు నిర్వహించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

నవ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు. దీన్ని అస్తంగత్వం లేదా మూఢం అంటారు. మూఢం ఉన్నప్పుడు గురు,శుక్ర గ్రహాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఏ శుభకార్యం జరపాలన్నా కావాల్సింది గురు బలం. కానీ గురు, శుక్రుడు రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు అంటున్నారు పండితులు. అందుకే ఆ సమయంలో శుభకార్యాలు చేసుకోరు.

మూఢంలో ఏ శుభకార్యాలు చేయకూడదంటే.

వివాహం చేయరాదు.

పుట్టు వెంట్రుకలు తీయరాదు

ఇల్లు మార్చకూడదు

లగ్నపత్రిక రాసుకోకూడదు.

గృహ ప్రవేశాలు చేయరాదు.

Advertisement

Next Story

Most Viewed