శ్రీరామ భక్తుడు హనుమంతుడు వెలసిన హృదయాకార ద్వీపం ఎక్కడుందో తెలుసా !

by Sumithra |
శ్రీరామ భక్తుడు హనుమంతుడు వెలసిన హృదయాకార ద్వీపం ఎక్కడుందో తెలుసా !
X

దిశ, ఫీచర్స్ : అయోధ్యలో రాంలాలా ప్రాణ ప్రతిష్ట చేసే రోజు సమీపిస్తున్న కొద్ది రామభక్తుల్లో సంతోషం కూడా పెరుగుతోంది. అయితే ఈ రోజు మనం శ్రీరామ చంద్రమూర్తికి పరమభక్తుడైన హనుమంతుని గురించి మాట్లాడుకుందాం.. ఆయన శ్రీరాముడిని రక్షించడానికి పాతాళానికి వెళ్ళాడని, ఈ సమయంలో అతను ఒక ద్వీపంలో ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ ద్వీపం ఏది, దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం అరేబియా సముద్రంలో హృదయాకార ద్వీపం ఉందని పేర్కొన్నారు. ఈ ద్వీపం చుట్టూ నీటికి వేల అడుగుల దిగువన గుహ ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. అహిరావణ నుంచి శ్రీరాముడు, లక్ష్మణుడిని రక్షించడానికి మహాబలి హనుమంతుడు ఆ గుహ ద్వారా పాతాళానికి వెళ్ళాడని పురాణగాధ. రామాయణ కాలంలో హనుమాన్ కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు కూడా పండితులు చెబుతున్నారు. ఆ ద్వీపంలో శ్రీరాముని విగ్రహాన్ని హనుమ ప్రతిష్టించాడని, నేటికీ అక్కడి ప్రజలు శ్రీరామున్ని పూజిస్తున్నారని చెబుతారు..

అరేబియా సముద్రంలో ఉన్న ఈ హృదయాకారంలో ఉన్న ద్వీపం పేరు నేత్రాని, ఇది బెంగళూరు సమీపంలోని మురుడేశ్వర్ సమీపంలో ఉంది. హనుమంతుడు వచ్చిన ప్రదేశం ఇదే అని, అందుకే ఈ ప్రాంతాన్ని భజరంగి ద్వీపం అని కూడా అంటారు. ఈ ద్వీపం ముఖ్యంగా స్కూబా డైవింగ్‌ లో ప్రసిద్ధి చెందింది. నేత్రాని ద్వీపం కేవలం ఒక ద్వీపం కాదని, అది హనుమంతుడు నివసించిన నివాసమని ప్రజలు నమ్ముతారు. ఈ దీవిలో రామాయణ కాలానికి సంబంధించిన చెరువు కూడా ఉంది, దీని నీరు నేటికీ మధురంగా ​​ఉంటుందని చెబుతారు.

Advertisement

Next Story

Most Viewed