కైలాస పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తి ఎవరో తెలుసా..

by Sumithra |
కైలాస పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తి ఎవరో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : కైలాస పర్వతం ఈ పర్వతం గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరనుకుంట. టిబెట్‌లో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో కైలాస పర్వతం ఒకటి. ఈ పర్వతం టిబెట్‌లోని మానస సరోవరానికి, రాక్షసతాల్ సరస్సుకు సమీపంలో ఉంది. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన సింధు, సట్లేజ్, బ్రహ్మపుత్రా, కర్నాలి నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయట. హిందూ మతంలో కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావిస్తారు. ఈ శిఖరాన్ని బోన్, బౌద్ధ, హిందూ, జైన మతస్థులు పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇంతటి పవిత్రమైన శిఖరాన్ని ఇప్పటి వరకు ఎంతోమంది పర్వతారోహకులు కైలాసగిరిని అధిరోహించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. ఈ పర్వతం పరిమానంలో ఎవరెస్టు శిఖరం కన్నాచిన్నగా ఉన్నా దీన్ని అధిరోహించడం చాలా కష్టంతో కూడుకున్న పనే.

అయితే ఎన్నో శక్తులు ఉన్న ఈ కైలాస శిఖరం పై దాదాపు 1000 ఏండ్ల క్రితమే ఓ సాధువు ఎక్కాడంటే నమ్ముతారా. ఎంతో సునాయాసంగా పర్వతాన్ని అధిరోహించి అక్కడ ఉన్న శక్తిని వశపరుచుకుని ధ్యానం కూడా చేశాడట. కైలాసపర్వతాన్ని అధిరోహించిన సాధువు అక్కడ ఎలాంటి శక్తిని చూశాడు అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇంతకీ కైలాసగిరి పర్వతాన్ని ఎక్కిన వ్యక్తి ఎవరు.. ఎలా అధిరోహించారు. ఇప్పుడు తెలుసుకుందాం.

సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం టిబెట్‌లో జరిగిన ఓ యదార్థ గాధ అని అక్కడి చరిత్ర చెబుతుంది. పూర్వం టిబెట్ ప్రాంతంలో ఓ సాధువు ఉండేవాడు. అతని పేరు జెట్సన్ మిలరేపా. ఈయన 1052 సంవత్సరంలో జన్మించాడట. అయితే మిలరేపా జన్మించిన కొద్ది రోజులకే అతని తండ్రి మరణిస్తూ తన ఆస్తిని తన సోదరునికి అప్పగించాడట. మిలరేపా యుక్తవయస్సుకు వచ్చిన తరువాత ఆస్తిని అతనికి ఇవ్వాలని తెలిపాడట. కానీ మిలరేపా పినతండ్రి ఆస్తిని స్వార్థ బుద్దితో మిలరేపాకి ఇవ్వకుండా మిలరేపాను, తన తల్లిని ఇంటినుంచి బయటికి గెంటేశాడట.

అప్పుడు మిలరేపా వారికి అన్యాయం చేసిన వారిపై కక్ష్య సాధించడానికి ఒక గురువు వద్ద చేరి తాంత్రికవిద్యను నేర్చుకుని తన పినతండ్రి కుటుంబం పై పగతీర్చుకున్నాడట. ఇక కొంత కాలానికి మిలరేపాకు తాంత్రిక విద్యను నేర్పించిన గురువు చనిపోతూ క్షుద్రపూజలు చేయడం వలన పాపాలు కలుగుతాయి అని, దేవుని సన్నిధానానికి చేర్చవు అని మిలరేపాకు చెప్పాడట. ఓ మంచి గురువును చూసి నీ జన్మకు పరమార్థాన్ని తెలుసుకోవాలని మిలరేపాకు హితబోధ చేస్తాడట. అప్పుడు మిలరేపా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

తాను మంచిమార్గంలో నడిచేందుకు భారతదేశంలో యోగ విద్యను నేర్చుకొని వచ్చిన మార్పా అనే గురువుని కలిశాడట. మిలరేపా గురవు వద్దకు వెళ్లిన సమయంలో మార్పా పొలాన్ని దున్నుతూ ఉండడాన్ని చూసి తాను కూడా పొలాన్ని దున్నడం ప్రారంభించాడట. కొద్దిసేపుగడిచిన తరువాత మిలరేపా మార్పాతో మాట్లాడుతూ నేను మీ దగ్గర శిశ్యరికం చేయాలనుకుంటున్నాను, నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి అంటూ ప్రాదేయపడ్డాడట. గురుదేవా నేను మీ దగ్గర జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను అని అడగడంతో తనగురువు మార్పా సరే అని ఒప్పుకున్నాడట.

అయితే దానికి మిలరేపాకు ఒ షరతు పెట్టాడట. ఓ ఏడాదికి సరిపడా ధాన్యాన్ని సంపాదించాలని మిలరేపాకు చెప్పాడట. దాంతో మిలారేపా ఒక్కరోజులోనే భిక్షాటన చేసి ఏడాదికి సరిపడా ధాన్యాన్ని సంపాదించాడట. ఆ ధాన్యానికి తీసుకువచ్చి మార్పా ఇంటిముందు ఎత్తేస్తాడట. అది చూసిన గురుదేవుడు మిలరేపా పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అప్పుడు మిలరేపా తన గురువుని క్షమించమని అడగగా అతన్ని క్షమించిన మార్పా బయటపనులు మాత్రమే చేయాలి, నీకు ఇప్పట్లో జ్ఞానబోధ చేయలేనని చెప్పాడట. దాంతో మిలరేపా వ్యవసాయం చేస్తూ కాలాన్ని గడిపాడని చరిత్ర చెబుతుంది. అప్పుడప్పుడూ ఆశ్రమంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిలరేపా వచ్చినా తనగురువు ఆగ్రహించేవాడట.

ఏండ్లు గడిచినా మిలరేపాతో తన గురువు మార్పా కఠినంగా ప్రవర్తించడంతో మిలరేపా తీవ్రమనస్థాపానికి గురై ఆత్యహత్యాయత్నం చేశాడట. అది తెలుసుకున్న మార్పా ఇప్పుడు నువు నిజంగా పచ్చాతాప్పడుతున్నావ్ నీకు ఇప్పుడు జ్ఞానబోధ చేస్తాను అంటూ చేరదీశాడట. కొన్ని రోజులు జ్ఞానబోధ చేసిన తరువాత మిలరేపాని ధ్యానం చేయాలని మార్పా ఆదేశిస్తాడు. అదికూడా కైలాస శిఖరం పైన వెళ్లి ధ్యానం చేయాలని సూచిస్తాడు. తన గురువు మాటను గౌరవించిన మిలరేపా 1093 సంవత్సరంలో మరికొంత మంది అనుచరులతో కలిసి పశ్చిమదిశగా కైలాసయాత్రను ప్రారంభించాడట.

కైలాస పర్వతాన్ని అధిరోహించే మార్గంలో మానససరోవరం ప్రాంతానికి చేరి అక్కడ బస చేశారట. అప్పుడు అక్కడ నరోవన్ అనే బౌద్ధమతస్తున్ని మిలరేపా కలుస్తాడు. అప్పుడు నరోవన్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మిలారేపాని అడిగగా కైలాసపర్వతం మీద ధ్యానం చేయడానికి వచ్చానని మిలారేపా సమాధానం చెప్పాడట. అప్పుడు నరోవన్ బౌద్ధమతాన్ని స్వీకరించిన వారు మాత్రమే కైలాసపర్వతాన్ని అధిరోహిస్తారు.. మీకు కైలాసపర్వతం అధిరోహించడం సాధ్యం కాదు.. తిరిగివెల్లిపోండి అని నరోవన్ చెప్పాడని చరిత్ర చెబుతుంది.

సాధన చేసే సాధకులు ఎవరైనా పర్వతాన్ని అధిరోహించి ధ్యానం చేయలగలరని, మా గరువు మార్పా చెప్పారని మిలారేపా సమాధానం చెప్పాడట. అప్పుడు నరోవన్, మిలరేపా మధ్య ఓ చిన్న వాగ్వాదం జరిగిందని తరువాత నరోవన్, మిలరేపాతో ఓ ఒప్పందం చేసుకున్నాడట. ఎవరైతే ముందుగా కైలాసపర్వతాన్ని అదిరోహిస్తారో వారే ఆదిపత్యం చేయగలని చెబుతాడు. ఆ తరువాత మిలరేపా నిద్రిస్తున్న సమయంలో నరోవన్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించాడట. నరోవన్ పర్వతం అంచుకు చేరుకునే సమయంలో గాఢనిద్రలో ఉన్న మిలారేపా లేచి శిఖరాన్ని వేగంగా అధిరోహించడం ప్రారంభించాడట. పర్వతం చివరలో ఉన్న నరోవన్ అంచుకు చేరుకోగానే అక్కడ ప్రకాశిస్తున్న కాంతిని తట్టుకోలేక తన ప్రయత్నాన్ని మానుకుంటాడట. తరువాత మిలారెపా పర్వతం అంచుకు చేరుకుని అక్కడ ఉన్న కాంతిని చూసి రెండు చేతులతో మొక్కి కాంతిని తన వశం చేసుకుని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు.

ఆ తరువాత మిలారేపా కైలాస పర్వతం నుంచి కాస్త మంచును తీసుకుని కిందికి విసిరేశాడట. ఆ మంచు కాస్తా చిన్న పర్వతం లాగా మారడంతో ఆ పర్వతాన్ని మిలారేపా నరోవన్ కు ఇచ్చాడట. ఇది బౌద్దమతానికి చెందిన పర్వతం ఈ పర్వతం మీద నుంచి కైలాస పర్వతాన్ని సులభంగా చూడవచ్చని మిలారేపా చెబుతాడు. చాలాకాలం పాటు కైలాసగిరి పై ధ్యానం చేసి కిందికి వచ్చిన మిలారేపా కైలాసపర్వతం మీదికి ఎవరూ వెల్లకూడదని, అక్కడి ఉన్న శక్తిని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడట. ఎవరిని తన దగ్గరకు రప్పించుకోవాలో ఈ శక్తే వారిని కైలాసపర్వతం మీదకు రప్పించుకుంటుందని చెబుతాడు. ఎవరు పడితే వారు కైలాసపర్వతం అధిరోహించలేరని, అలా చేస్తే అదివారికే ప్రమాదం అని చెప్పాడట. కానీ పర్వతం మీద ఉన్న శక్తి ఏంటి, అక్కడ ఏ శక్తి మిలారేపాకు దర్శనం ఇచ్చింది అన్ని విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాడట. అందుకే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని పిలుస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed