సంక్రాంతి పండగను ఏయే రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసా..!

by Sumithra |
సంక్రాంతి పండగను ఏయే రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసా..!
X

దిశ, ఫీచర్స్ : సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల ముందు నుంచే సంక్రాంతి పండుగ సంబురాలను ప్రారంభిస్తారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయంలో భోగి మంటలు, భోగి పళ్లు, హరిదాసు కీర్తనలు, ముగ్గుల పోటీలు, కోడి పందేలు, పిండి వంటలు, గాలిపటాలు ఎగరవేస్తూ పండగను జరుపుకుంటారు. ఈ పండగను తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో, పొంగల్, లోహ్రి లాంటి పేర్లతో జరుపుకుంటారు.

గాలిపటాల పండుగ..

రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను ఉత్తరాయాణ (గాలిపటాల పండుగ)గా పిలుస్తారు. ఆయా రాష్ట్రాల్లో సంక్రాంతి రోజున చిన్నపిల్లలు నుంచి పెద్దవారి వరకు గాలిపటాలను ఎగురవేస్తూ సంబరాలు జరుపుకుంటారు.

లోహ్రీ..

చండీఘర్, హర్యానా, పంజాబ్, రాష్ట్రాల్లో మాఘి పేరిట సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. అలాగే లోహ్రి వేడుకలను మకర సంక్రాంతికి ఒక రోజు ముందు జరుపుకుంటారు.

రామ జన్మభూమిలో..

ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో మకర సంక్రాంతిని ఖిచిడీ అని పిలుస్తారు. ఈ పండుగ రోజు ఉద్దిపప్పు, బియ్యంతో ఖిచిడీని తయారు చేస్తారు. అలాగే వేరుశనగలు, బెల్లంతో వంటకాలు చేస్తారు. వీటితో పాటు నువ్వుల లడ్డూలను చేస్తారు.

తమిళంలో పొంగల్..

ఆంధ్ర, తెలంగాణలోనే కాదు తమిళనాడు రాష్ట్రంలో కూడా పొంగల్ పేరుతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇక్కడ సంక్రాంతి సమయంలో ‘జల్లి కట్ట’ పందేలను ఘనంగా నిర్వహిస్తారు. పండగ నాలుగు రోజులలో మొదటి రోజును భోగి పొంగల్, రెండో రోజును సూర్య పొంగల్, మూడో రోజును మట్టు పొంగల్, నాలుగో రోజును కన్యా పొంగల్ సంబరాలను జరుపుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed