పూర్వీకుల ఫోటోలు ఈ దిక్కున పెట్టి పూజిస్తున్నారా.. కష్టాల్లో పడ్డట్టే..

by Sumithra |
పూర్వీకుల ఫోటోలు ఈ దిక్కున పెట్టి పూజిస్తున్నారా.. కష్టాల్లో పడ్డట్టే..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : పితృ పక్షం 16 రోజులు పూర్వీకులను సంతృప్తిపరచడానికి, వారి ఆత్మలను సంతోషపెట్టడానికి మంచి అవకాశం అంటున్నారు పండితులు. పితృ పక్షం భాద్రపద పూర్ణిమ (Bhadrapada Purnima) నుండి ప్రారంభమై అశ్వియుజ అమావాస్య (Asviyuja Amavasya) నాడు ముగుస్తుంది. ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 17 మంగళవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 2 న ముగియనుంది. ఈ కాలంలో చాలా మంది తమ ఇళ్లలో చనిపోయిన పూర్వీకుల చిత్రాలను ఉంచి పూజలు చేస్తుంటారు. కానీ దిశ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, పూర్వీకుల చిత్రపటాన్ని తప్పుడు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో పితృదోషం కలగవచ్చు. ఇంతకీ పూర్వీకుల చిత్రాలను ఏ దిశలో ఉంచాలి ? ఎలా పూజించాలి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రదేశంలో పూర్వీకుల ఫోటోలు పెట్టవద్దు..

పూర్వీకుల చిత్రాలను డ్రాయింగ్‌రూమ్‌లో లేదా బెడ్‌రూమ్‌లో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ( Vastu Shastra) ప్రకారం ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు. ఇది ఇంట్లో కలహాలు, సంబంధాలలో చీలికలకు కారణమవుతుందంటున్నారు. అంతే కాదు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

పూర్వీకుల ఫోటోలు పెట్టే సరైన దిశ..

పూర్వీకుల చిత్రాలను ఉంచడానికి దక్షిణ దిశ ఉత్తమంగా చెబుతున్నారు. పూర్వీకుల చిత్రాలను దక్షిణ దిశలో ఉంచడం ద్వారా వారి ముఖం ఉత్తరం వైపునకు తిరిగి ఉంటుంది. వాస్తవానికి హిందూ మతం ( Hindu religion), వాస్తు శాస్త్రంలో, దక్షిణ దిశను యమదేవుని దిశగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు.

అలాగే చనిపోయిన వ్యక్తి ఫోటోతో జీవించి ఉన్న వ్యక్తి ఫోటోను కలిపి ఉంచకూడదంటున్నారు. ఇలా చేయడం వల్ల జీవించి ఉన్న వ్యక్తి ఆయుష్షు తగ్గిపోతుందని చెబుతున్నారు. అంతే కాదు వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురికావడం కూడా గమనించవచ్చంటున్నారు.

పూర్వీకుల ఆశీస్సులు ఎలా పొందాలి..

పితృపక్షం పూర్తిగా పూర్వీకులకు అంకితం చేశారని పండితులు చెబుతున్నారు. 15 రోజుల పాటు జరిగే పితృ పక్షంలో పూర్వీకులకు తర్పణం, పిండదానం, శ్రాద్ధ కర్మలు చేస్తారని పండితులు చెబుతున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.

Advertisement

Next Story

Most Viewed