- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతికి కాకుండా కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారా.. ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజుల్లో చాలా మంది కాళ్లకు నల్లదారం కట్టడాన్ని చూస్తూనే ఉన్నాం. అలాగే మరి కొంత చేతులకు కూడా సన్నని నల్లటి దారాలను కట్టుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే హిందూ మతం ప్రకారం శరీరంలోని ఏ భాగంలో నల్ల దారాన్ని కట్టుకోవడం మంచిదా కాదా, పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పాదాలకు నల్ల దారం కట్టవచ్చా.. ?
పండితులు ఏం చెబుతున్నారంటే చాలా మంది ప్రజలు తమ పాదాలకు నలుపు దారాన్ని ధరించి కనిపిస్తున్నారు. ఇలా చేయడం మంచిదే అంటున్నారు. నల్ల దారాన్ని ఎడమ కాలికి కట్టుకోవడం వలన దృష్టి దోషాలు, శని దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
శరీరంలోని ఏ భాగంలో నల్ల దారాన్ని కట్టాలి ?
చాలామంది చిన్న పిల్లల పై, నవ వధువుల పై నరదిష్టి పడకుండా రక్షించడానికి మెడ చుట్టూ నల్లని దారాన్ని వేస్తుంటారు. ఈ దారాన్ని మెడకు కాకుండా నడుము చుట్టూ ధరింప చేయడం మంచిదంటున్నారు పండితులు. శ్రీకృష్ణుడు కూడా తన నడుము చుట్టూ నల్లటి దారాన్ని ధరించేవాడట. నడుము పై నల్లటి దారం కట్టడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుందట. ముఖ్యంగా ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. వెన్నెముక కూడా బలంగా మారుతుందంటున్నారు. వారి జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉన్నవారు నడుముకు నల్లటి దారాన్ని కట్టుకోవాలని చెబుతున్నారు.
జాతకంలో శని బలవంతుడైతే అలాంటి వారు జీవితంలో చాలా పురోగమిస్తారు. మీరు నడుము, ఎడమ చేయి లేదా మెడ చుట్టూ నల్లటి దారాన్ని ధరించాలనుకుంటే, ఈ దారాన్ని శని ఆలయానికి తీసుకెళ్లి, శని దేవుడి విగ్రహంతో తాకి ధరించండి. భైరవుడు లేదా హనుమాన్ విగ్రహం ముందు కూడా ఈ దారాన్ని ధరించవచ్చంటున్నారు. మంత్రాలను పఠిస్తూ నల్ల దారాన్ని కట్టాలని చెబుతున్నారు. అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు. శనిదేవుని ఆశీస్సులు కూడా వారిపై ఎల్లప్పుడూ ఉంటాయంటున్నారు. అంతే కాదు చేతులకు ఎర్రటి దారం లేదా మౌళిని ధరించినట్లయితే అప్పుడు నల్ల దారాన్ని అస్సలు కట్టవద్దంటున్నారు.
నల్ల దారం ధరిస్తే కలిగే ప్రయోజనాలు..
స్త్రీలు తమ ఎడమ చేతికి, పురుషులు కుడి చేతికి నల్ల దారం కట్టాలి.
నల్ల దారాన్ని కట్టుకున్నప్పుడు అది చెడు కన్ను నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి దీన్ని ధరిస్తారు.
నల్ల దారం శరీరంలోకి ప్రవేశించే ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది.
నల్ల దారం ధరించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి.
నడుముకు కట్టుకోవడం వల్ల వెన్నెముకలో ఎలాంటి సమస్యా రాదు.
నల్ల దారాన్ని ఎప్పుడు తీసివేయాలి..
శరీరం పై ఉన్న నల్లదారం దానంతట అదే తెగిపోయే వరకు ధరించవచ్చు. దీన్ని మీరే తెంచడానికి ప్రయత్నించవద్దు. అది తెగిపోతే దాన్ని పీపాల్ చెట్టు దగ్గర ఉంచాలి. నల్లదారాన్ని ఏ రాశివారైనా ధరించవచ్చు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.