సంక్రాంతి రోజు ఏ సమయంలో స్నానం చేయాలి.. పండితులు ఏం చెబుతున్నారు

by Sumithra |
సంక్రాంతి రోజు ఏ సమయంలో స్నానం చేయాలి.. పండితులు ఏం చెబుతున్నారు
X

దిశ, ఫీచర్స్ : ఈ ఏడాది మకర సంక్రాంతి రోజున ఏ సమయంలో స్నానం చేయాలా అని చాలామంది అయోమయంలో ఉన్నారు.. మకర సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలా లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేయాలా అని చాలామంది సందేహంతో ఉన్నారు. అయితే ఇది మీ కోసమే.

జనవరి 15న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడని పండితులు చెబుతున్నారు. ఉదయం 9:13 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 15న ఉదయం 9:14 నుండి సూర్యాస్తమయం వరకు, ప్రజలు నదీ స్నానం చేసి దేవుడిని ప్రార్థించవచ్చు. అలాగే ఉదయం 9:20 నుండి 10:05 వరకు ఉన్న సమయం అత్యంత శుభప్రదమైనది పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తంలో గంగా, గోదావరి, సంగమం సహా అన్ని పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు.

మకర సంక్రాంతి సందర్భంగా, పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత, తప్పనిసరిగా బెల్లం, నువ్వులు, అన్నం అవసరమైన వారికి దానం చేయాలని చెబుతున్నారు. దీని ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం పొంది పుణ్యం కూడా లభిస్తుంది. పాపాల నుండి విముక్తి కోసం ఈ రోజు చాలా ముఖ్యమైనది.

సంక్రాంతి అంటే నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి. ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.

సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసం ప్రియులకు మంచి కూరలతో, మూడు రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed