- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024 మార్గశిర అమావాస్య పూజా విధానం.. శుభ ముహుర్తాలివే..
దిశ, ఫీచర్స్ : జనవరి 11న గురువారం రోజున వచ్చే మార్గశిర అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మార్గశిర అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం చేసి సూర్య భగవానున్ని ప్రార్థించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజున పిండి దీపాలు, కుంభ దీపాలను వెలిగించాలి. అలాగే రావి చెట్టుకు దీపం వెలిగిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు వదలడం, శ్రాద్ధం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అంతే కాదు కాలసర్ప దోషం ఉన్నవారు ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తే దోషం తొలగిపోతుందని చెబుతున్నారు. అలాగే ఈ రోజు ఉపవాసం ఉంటే పూర్వీకుల ఆత్మలతో పాటు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, సూర్యుడు, రుషి, పక్షులు, జంతువులు, అగ్ని, గాలి, ప్రేతాత్మలకు కూడా శాంతి లభిస్తుందని చెబుతున్నారు. అలాగే బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని చెబుతున్నారు. జాతకంలో శని దోషం, పితృ దోషం ఉండే నువ్వులు, వంట సామాగ్రి, దుప్పట్లు దానం చేస్తే మంచిదట.
శుభ ముహూర్తం..
అమావాస్య తిథి ప్రారంభం : 10 జనవరి 2024, రాత్రి 10:25 గంటలకు
అమావాస్య తిథి ముగింపు : 11 జనవరి 2024, సాయంత్రం 5:27 గంటలకు