నటి మృతి.. భర్తపై మరో నటి ఆరోపణలు

by Shamantha N |
నటి మృతి.. భర్తపై మరో నటి ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్ : హిందీ టెలివిజన్ నటి దివ్యా భట్నాగర్ మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆమె చివరకు ప్రాణాలు విడిచింది. దివ్య అకాల మరణం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేయగా.. తన ఫ్రెండ్ దేవోలీనా భట్టాచార్జీ ఈ విషయంలో దివ్య భర్తపై ఆరోపణలు చేసింది. స్నేహితురాలి మరణానికి పరోక్షంగా ఆమె భర్త గగన్ గబ్రు కారణమని సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది.

దివ్యను మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలు పెట్టేవాడని.. ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకునేందుకు దివ్యను వాడుకున్నాడని తెలిపింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు ఇష్టం లేకున్నా దివ్య గగన్‌ను పెళ్లి చేసుకుందని కానీ తనను చాలా టార్చర్ చేసేవాడని చెప్పింది. అంతేకాదు సిమ్లా పోలీస్ స్టేషన్‌లో గగన్ మీద డొమెస్టిక్ వయొలెన్స్ కేసుతో పాటు ఎన్‌సీ కూడా నమోదు చేసినట్లు తెలిపింది. తన ఆరోపణలపై సాక్ష్యాధారాలతో ముందుకు వస్తానని స్పష్టం చేసింది దేవోలీనా.

Advertisement

Next Story