నా కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం..‘శంకర’న్న నువ్వు గ్రేట్

by Sumithra |
నా కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం..‘శంకర’న్న నువ్వు గ్రేట్
X

దిశ, మణుగూరు : నా కుటుంబం కన్నా ప్రజల బాధలు, సుఖ సంతోషాలే నాకు ముఖ్యం అని సమితి సింగరం రాజీవ్ గాంధీ నగర్ ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్ అన్నారు. ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తానని, నా జీవితాన్ని కూడా లెక్కచేయకుండా ఏమైనా చేస్తానని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి కే. సత్యనారాయణ అనే వ్యక్తి కరోనాతో మరణిస్తే.. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి.. దగ్గరుండి మరీ దహన సంస్కారాలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా జీవితం కన్నా, నా కుటుంబం కన్నా, ప్రజల బాధలు, సుఖ సంతోషాలే నాకు ముఖ్యమని అన్నారు. కరోనాతో మరణించిన సత్యనారాయణకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనాతో ఎవరైనా మరణిస్తే దగ్గరుండి దహన సంస్కారాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

అనంతరం రాజీవ్ గాంధీ నగర్ ప్రజలు మాట్లాడుతూ.. కరోనా అని భయపడి.. కనీసం చూడటానికి కూడా రాని ఉన్న పరిస్థితులలో శంకర్.. దహన సంస్కారాలు నిర్వహించారని తెలిపారు. ఆయనకు మేము ఎంతో రుణపడి ఉంటామని ఏరియా ప్రజలు అన్నారు.

Advertisement

Next Story