జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

by Shyam |   ( Updated:2021-06-10 08:46:06.0  )
Mulugu DEO Vasanthi suggests teachers to Apply online Application for the National Best Teacher Awards
X

దిశ, ములుగు : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ములుగు డీఈవో వాసంతి గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుండి 2021 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఆన్లైన్ ద్వారా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఢిల్లీ వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.

http://mhrd.gov.in (MHRD) వైబ్సైట్ ద్వారా దరఖాస్తులను చివరి తేది 20-06-2021లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇట్టి అవకాశాన్ని ములుగు జిల్లాలోని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.

Advertisement

Next Story