ఆ గ్రామస్థులకు దడ పుట్టిస్తున్న డెంగ్యూ ..

by Aamani |   ( Updated:2021-08-02 02:57:23.0  )
ఆ గ్రామస్థులకు దడ పుట్టిస్తున్న డెంగ్యూ ..
X

దిశ, బోధన్ : గ్రామంలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. గత నెల రోజులుగా గ్రామ ప్రజలు తీవ్ర జ్వరం, మోకాలు, మోచేయిల నొప్పులతో బాధ పడుతున్న ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హుంన్స గ్రామంలో చోటు చేసుకుంది. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు ఎంత కోరినా అధికారులు వారి మాటలను పెడ చెవిన పెడుతున్నారు. దోమలతో కుటుంబం మొత్తం అనారోగ్యం పాలవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించాలని కోరుతున్నా.. అధికారులు స్పందించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

Advertisement

Next Story