అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న దాడులు..

by Shyam |
Nizampet
X

దిశ, నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలపై ఎస్టీఎఫ్ టీం దాడులు కొనసాగుతున్నాయి. నిజాంపేట్ ఎస్టీఎఫ్ టీం హెడ్ ఆర్ ఐ శ్రీదేవి ఆధ్వర్యంలో మంగళవారం నుంచి దాడులు జరుగుతున్నాయి. పలు ఫిర్యాదులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పందిస్తున్న అధికారులు బుధవారం ప్రగతి నగర్ వాసవి లే ఔట్, నిజాంపేట్ సైదయ్య కాలనీ, బండారి లేఔట్ కాలనీ లో మున్సిపల్ చట్టం -2019 కి విరుద్ధంగా నిర్మించిన పలు భవంతుల స్లాబులను కూల్చి వేశారు. అనంతరం ఎస్టీఎఫ్ ఇంచార్జ్ బాచుపల్లి రెవెన్యూ ఆర్ ఐ శ్రీదేవి మాట్లాడుతూ.. చట్ట విరుద్ధంగా ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టినా కూల్చివేత తప్పదని హెచ్చరించారు. బిల్డర్లు మున్సిపల్ చట్టం -2019 ప్రకారం మాత్రమే అనుమతి పొంది, భవంతులను నిర్మించాలని సూచించారు. నిజాంపేట్ కార్పొరేషన్ లో ఎస్టీఎఫ్ బృందం నిరంతరం దాడులు నిర్వహిస్తూ చట్ట విరుద్ధంగా వెలుస్తున్న భవంతులపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి పావని, బాచుపల్లి ఎస్ ఐ రవి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story