- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్రాన్స్‌ఫార్మర్ మార్చడానికి లంచం
దిశ, తాండూరు: ఏసీబీ దాడుల్లో మరో అవినీతి చేప బయటపడింది. తాండూరు ఏడీఏ కార్యాలయంలో లంచం తీసుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్ దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ ఫయాజ్ కథనం ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన ఎండీ ఖలీద్‌కు తాండూరు మండలంలోని మల్కాపూర్ ప్రాంతంలో బండల గనులు ఉన్నాయి. నాపరాతి కటింగ్ చేసేందుకు విద్యుత్ సరఫరా కోసం 71 HP ట్రాన్స్ ఫార్మర్ వాడుతున్నాడు. తద్వారా బిల్లు ఎక్కువగా వస్తుందని, తనకు 41 HP ట్రాన్స్ ఫార్మర్ కావాలని ఏడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
ఆరు నెలలు గడిచినా ఆయనకు కావాల్సిన ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయలేదు. 30 వేలు ఇస్తే దరఖాస్తు ముందుకు పంపుతానని కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్ బాబా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఈనెల 23న ఏసీబీ అధికారులకు సమాచారం అందించినట్టు తెలిపారు. సదరు వ్యక్తి రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకొని గురువారం అతడి చేతికి అందజేశారు. దీంతో ఏసీబీ అధికారులు రైడ్ హ్యాండెడ్‌గా కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్ బాబాను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇతడి వెనుక ఎవరున్నారనే దానిపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉంటే పలు గ్రామాల్లో లైన్ మెన్లు విద్యుత్ మీటర్లు బిగించేందుకు సైతం లంచం అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.