- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మల్లారెడ్డి బర్తరఫ్‌కు డిమాండ్
దిశ ప్రతినిధి, మేడ్చల్: పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డ మంత్రి మల్లారెడ్డి సోదరుడు నర్సింహరెడ్డిపై కఠినచర్యలు తీసుకోవాలని, పేకాటను ప్రోత్సహిస్తున్న మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం న్యూ బోయిన్ పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్ ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జె.రామక్రిష్ణ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఒకవైపు సీఎం కేసీఆర్ పేకాటను పూర్తిగా నిలిపివేయగా.. మంత్రి మల్లారెడ్డి మాత్రం తన తమ్ముడితో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తుండడం సిగ్గచేటన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని మల్లారెడ్డి గార్డెన్ కార్యాలయంలో పెట్టుకొని, కార్యాలయాన్ని పేకాట స్థావరంగా మార్చేశారని దుయ్యబట్టారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓల్డ్ గ్రాంట్స్ బంగళాలో మంత్రి మల్లారెడ్డి అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్వహించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓల్డ్ గ్రాంట్స్ బంగళాలో అక్రమ వ్యాపారాలు, దందాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు బోర్డు అధ్యక్షుడు, సీఈఓలకు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న అక్రమణలపై లోతైన దర్యాప్తు జరపాలని రాష్ట్ర గవర్నర్, డీజీపీకి విన్నవించనున్నట్లు తెలిపారు. మహాంకాలి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేశ్ మాట్లాడుతూ.. పేకాట శిబిరాన్ని ఇల్లీగల్ గా నిర్వహిస్తూ పేద, మధ్య తగరతి ప్రజలను నిలువున ముంచుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలకు విరుద్దంగా వ్యవహారిస్తున్న మంత్రి మల్లారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి మల్లారెడ్డి ఎక్కడ? అని నగేశ్ ప్రశ్నించారు.