భారత్‌ను వెంటాడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్

by Shamantha N |   ( Updated:2021-06-23 06:44:14.0  )
భారత్‌ను వెంటాడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్
X

దిశ,వెబ్‌డెస్క : కరోనా సెకండ్ వేవ్ కేసులు కాస్త తగ్గుతున్నాయని అనుకునేలోపే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడిన భారత్‌ను డెల్టా ప్లస్ వేరియంట్ వెంటాడుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 40కి పైగా కేసులు వెలుగు చూసినట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో 6, కేరళలో 3, తమిళనాడులో 3 కేసులు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌ తదితర రాష్ట్రాలలోనూ ఈ కేసులు బయటపడినట్టు అధికారులు వెల్లడించారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డెల్టా ప్లస్ కేసులు భారత్‌తో సహా తొమ్మిది దేశాలలో వెలుగు చూశాయి. పోర్చుగల్, రష్యా, యూకే, నేపాల్, పోలాండ్, చైనా, జపాన్ లో నమోదయ్యాయి. ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 200 ఉంటే 40 కేసులు భారత దేశం‌లోనే ఉడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరమైనదని, ఇది మొత్తం ఇమ్యూనిటీ వ్యవస్థనే దెబ్బ తీస్తుందని, ఇది ఈజీగా సక్రమిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే వేరియంట్ ఊపిరితిత్తుల కణాలతో గట్టిగా బంధం ఏర్పరుచుకోవడంతో ఇది ఏ చికిత్సకు లొంగదంటున్నారు. అయితే ఈ డెల్టాప్లస్ వేరియంట్‌‌నే ఏ వ్యాక్సిన్లు అడ్డుకోలేవని నిపుణులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story