ప్లీజ్ మా దేశానికి రావొద్దు : రైతులు

by Anukaran |
ప్లీజ్ మా దేశానికి రావొద్దు : రైతులు
X

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పర్యటనకు రైతుల నిరసన సెగ తాకింది. బోరిస్ జాన్సన్ భారత్ రావొద్దంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అంతేగాకుండా బ్రిటన్ ఎంపీలు వాళ్ల ప్రధాని భారత్‌కు రాకుండా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సింఘు సరిహద్దు దగ్గర ధర్నా చేస్తున్న రైతు సంఘాల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చర్చలపై కేంద్రం రాసిన లేఖపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతుల డిమాండ్లను కేంద్రం ఒప్పుకునే వరకూ బోరిస్ భారత పర్యటన రద్దు చేసుకోవాలని రైతు సంఘాలు లేఖ రాసాయి.

Advertisement

Next Story