ముగిసిన దీక్షిత్ అంత్యక్రియలు..

by Sumithra |
ముగిసిన దీక్షిత్ అంత్యక్రియలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : డబ్బుల కోసం కిడ్నాప్ చేసి, ఆపై దారుణహత్యకు గురైన చిన్నారి దీక్షిత్‌ అంత్యక్రియలు కొద్దిసేపటి కిందటే పూర్తయ్యాయి. బాలుడి తండ్రి రంజిత్‌ స్వగ్రామం శనిగపురం కావడంతో అక్కడే అంత్యక్రియలు జరిపారు. అక్కడకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడిని హత్యచేసిన నిందితుడిది కూడా శనిగపురమే కావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో పోలీసులను భారీగా మోహరించారు. దీక్షిత్‌కు మత్తు మందు ఇచ్చి నాలుగురోజుల కిందట కిడ్నాప్ చేశారు. రూ.45 లక్షలు కావాలంటూ తల్లికి ఇంటర్ నెట్ కాల్స్ చేసి వేధించారు. దీంతో బాలుడి తండ్రి డబ్బుల బ్యాగుతో కిడ్నాపర్లు చెప్పిన స్థావరంలో రాత్రంతా జాగారం చేశారు. అయినా కిడ్నాపర్లు వచ్చి డబ్బును తీసుకెళ్లలేదు. చివరకు దీక్షిత్ మృతదేహం మహబూబాబాద్‌ శివారు గుట్టల్లో లభ్యమైంది. బాలుడిని మొదట హత్యచేసి, మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story