- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫాజుల్ నగర్ హత్య కేసు.. రిమాండ్‌కు ఎందుకు తరలించలేదు?
దిశ, వేములవాడ: సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. హత్య చేసిన తీరు, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను సేకరించేందుకు వేములవాడ నుండి కొండగట్టు, అటు నుంచి కోరుట్ల వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హత్య చేసిన వ్యక్తులు బుధవారం తెల్లవారుజామునే లొంగిపోయిన విషయాన్ని పోలీస్ అధికారులు ధృవీకరించారు. రోజులు గడుస్తున్నా నిందితులు ఇద్దరిని పోలీసులు రిమాండ్ చేయకపోవడంతో కేసు విషయంలో ఏం జరుగుతుందోనని స్థానికులతో పాటు నిందితుల కుటుంబ సభ్యులు హైరానా పడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్ నగర్ లో పిట్టల మహేష్ (25) అనే యువకుడుని పిట్టల లక్ష్మీనరసయ్య, పిట్టల పరశురాం మంగళవారం రాత్రి కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన ఇరువురు తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ముందుగా జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతానికి వెళ్లి అక్కడ రక్తంతో కూడిన తమ దుస్తులను వదిలేసి అటునుండి జగిత్యాల జిల్లా మీదుగా కోరుట్ల వెళ్లి తలదాచుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారని తెలియడంతో పాటు పిట్టల కుటుంబంలోని కొందరిని పోలీసులు ప్రశ్నిస్తూ హత్య చేసిన నిందితులు తమకు తాముగా లొంగిపోవాలని సూచించినట్లు సమాచారం. అన్ని విషయాలను ఆలోచన చేసిన నిందితులిద్దరూ బుధవారం తెల్లవారుజామునే వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆ రోజు నుండి ఇప్పటివరకు నిందితులిద్దరూ పోలీసుల అదుపులోనే ఉండటం, రిమాండ్‌కు తరలించడంతో కేసు విషయంలో అసలు ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది.
మారణాయుధాలు దొరికేవరకు
హత్య చేసేందుకు దారితీసిన విషయాలు, హత్య చేయడానికి వినియోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకునే విధానంలో పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితులు తెలిపినట్లు ముందుగా పలువురు పోలీసు అధికారులు కొండగట్టు వెళ్లి అక్కడ కొన్ని ఆధారాలను సేకరించి అటు నుంచి కోరుట్లలో వరద కాలువలో హత్యకు ఉపయోగించిన కత్తిని వదిలేసినట్లు నిందితులు చెప్పడంతో పోలీసులు కోరుట్లలో గాలింపు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఇప్పటివరకు హత్య చేసేందుకు ఉపయోగించిన మారణాయుధాలు పోలీసులకు చిక్క లేదని, వాటిని చేజిక్కించుకునే పనిలోనే పోలీస్ అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. అన్ని సేకరించిన తర్వాతే నిందితులను రిమాండ్‌కు తరలించే అవకాశాలున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే క్షణికావేశంలో చేసిన హత్యకు పశ్చాత్తాపంగా లొంగిపోయిన నిందితులను రోజుల తరబడి పోలీసుల అదుపులో ఉంచడంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ కుదిరితే ఈరోజు హత్య చేసిన ఇరువురిని పోలీస్ అధికారులు రిమాండ్‌కు తరలించే అవకాశాలున్నాయి.
- Tags
- fazul nagar