ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో మృతదేహం

by Anukaran |   ( Updated:2020-10-24 08:56:49.0  )
ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంపు కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణం రామస్వామి గట్టు వద్ద శనివారం వెలుగులోకి వచ్చింది.

ఎస్ఐ అనిల్ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలో సాయిబాబా థియేటర్ సమీపంలో నివాసముంటున్న పాగాల రవి, జగ్గయ్యపేటకు చెందిన లతకు 2009లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో.. రవి మోడల్ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు కాపలదారుగా పనిచేస్తున్న తన అక్క వెంకటనారాయణమ్మ ఇంట్లో ఉంటున్నాడు.

కాగా, శనివారం తెల్లవారుజామున 5గంటలకు రవి బహిర్భూమికి అని చెప్పి వెళ్ళాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని కోసం వెళ్లి చూడగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ గదిలో చలనం లేకుండా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య.. తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story