ఇదేంది.. కరోనా పేషెంట్ల మధ్య డెడ్ బాడీలు

by Sumithra |
ఇదేంది.. కరోనా పేషెంట్ల మధ్య డెడ్ బాడీలు
X

దిశ, మాహబూబాబాద్: కరోనా వైరస్ సోకిన వారికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, చికిత్స పొందుతూ మరణించినవారిని కూడా అదే వార్డుల్లోని బెడ్‌ల మీద గంటల తరబడి ఉంచిన భాగోతం బయటపడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ వార్డులో సోమవారం ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. మృతి చెందిన వెంటనే మృతదేహాలను అక్కడి నుంచి తరలించకుండా సుమారు 8 గంటల సేపు ఐసోలేషన్ వార్డులోనే పెట్టారు. దీంతో అదే వార్డులో ఉన్న కరోనా పేషెంట్ల భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పేషెంట్ల బంధువులు తీవ్ర ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story