అగ్నికి ఆహుతి అయిన డీసీఎం

by Sridhar Babu |
అగ్నికి ఆహుతి అయిన డీసీఎం
X

దిశ, మోత్కూరు:మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన కోల బాలరాజు తన సొంత డీసీఎం లో బొల్లారం వద్ద ఏషియన్ పెయింట్కు సంబందించినమెటీరియల్, దబిల్ పూర వద్ద ఆసుపత్రి మెటీరియల్ లోడ్తో వయా మోత్కూర్ మీదుగా కలకత్తాకు బయలుదేరాడు. ఈ క్రమంలో మోత్కూరు వచ్చి భోజనం చేసి మరుసటి రోజు ఉదయం వెళ్దామని డీసీఎంను చెరువుకట్ట వద్ద నిలిపి ఇంటి వెళ్లగా అర్ధరాత్రి వాహనంలో మంటలు చెలరేగాయి.

దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబంధికి, యజమానికి సమాచారం అంధించారు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వాహన యజమాని మాట్లాడుతూ ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సరుకు విలువ రూ.19లక్షలు ఉంటుందని, వాహనం తో పాటు మొత్తం 40లక్షలు ఆస్తి నష్టం కన్నీటి పర్యంతమై విలపిస్తూతెలియజేశాడు.ఈసంఘటనపై కేసునమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story