సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ‘దవా దోస్త్‘

by Shyam |
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ‘దవా దోస్త్‘
X

దిశ, కంటోన్మెంట్: దక్షిణ మధ్య రైల్వే ఇండియన్ రైల్వే స్టేషన్ అభివృద్ది సంస్థ(ఐఆర్ సీడీసీ) రైల్వే ప్రయాణికులకు ‘దవా దోస్త్’ అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లలో ప్రధానమైన, అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఒకటవ నెంబర్ ప్లాట్ ఫాం జనరల్ వెయిటింగ్ హాల్ లో గురువారం అత్యవసర మెడికల్ రూమ్, జనరిక్ మెడిసిన్ ఔట్ లెట్ “దవా దోస్త్”ను సికింద్రాబాద్ డివిజన్ డివిజినల్ రైలే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే,ఐఆర్ సిడిసీ అధికారులు పాల్గొన్నారు. అత్యవసర మెడికల్ రూమ్ ,జనరిక్ మెడిసిన్ ఔట్ లేట్ లు మెన్సర్స్ దవాదోస్త్ ఫార్మా ప్రయివేట్ లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్నారు.

రైల్వే ప్రయాణికుల కోసం 24 గంటల పాటు షిప్టుల వారిగా వైద్యులు అందుబాటులో ఉండడంతోపాటు అవసరమైన మందులను తగ్గింపు ధరలకే లభిస్తాయి.ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ… రైలు ప్రయాణికుల అవసరాల మేరకు వారికి కావాల్సిన నదుపాయాలు మరియు సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు కోసం ప్రయోజరకరంగా ఉండే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకొచ్చిన ఐఆర్ఎస్ డీసీ వారిని ఆయన అభినందించారు. అనంతరం అభయ కుమార్ గుప్తా అక్కడ హౌస్ కీపింగ్ సిబ్బంది. రైల్వే ఉద్యోగులకు, ప్రయాణికులకు కరోనా వైరస్ నివారణ మెడికల్ కిట్లను అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed