AUS vs IND: బాక్సింగ్ డే టెస్టులో కొనసాగుతున్న స్లెడ్జింగ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-29 11:09:48.0  )
AUS vs IND: బాక్సింగ్ డే టెస్టులో కొనసాగుతున్న స్లెడ్జింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : మెల్బోర్న్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్‌ జట్ల (Australia vs India)మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు(4th Test) బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో స్లెడ్జింగ్(Sledging) కొనసాగుతోంది. టెస్టు తొలిరోజు ఆసీస్ యువ ఓపెనర్ కొన్‌స్టాస్‌ను విరాట్ కోహ్లీ భుజంతో ఢీకొట్టి స్లెడ్జింగ్ చేయడంతో ఘర్షణ మొదలైంది. విరాట్ అవుటై పెవిలియన్ కు వెలుతున్న సమయంలో అసీస్ ప్రేక్షకులు అతడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ బ్యాటింగ్‌ సమయంలో అరవాలంటూ ఆస్ట్రేలియా ఆటగాడు కొన్‌స్టాస్‌ అభిమానులను కోరాడు. అసీస్ రెండో ఇన్నింగ్స్ లో తన బౌలింగ్ లో కొన్‌స్టాస్‌ ఔటైనప్పుడు బుమ్రా కూడా అదేరీతిలో చేయడంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఈ టెస్టు తొలి రోజున ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌ లో బూమ్రా బౌలింగ్ లో యువ ఆటగాడు కొన్‌స్టాస్‌ దూకుడుగా ఆడి హాఫ్‌ సెంచరీ సాధించాడు. బూమ్రా బౌలింగ్ పై కొన్ స్టాస్ ఎదురుదాడిని అసీస్ మీడియా హైప్ చేసింది. దీంతో వీరి మధ్య రెండో ఇన్నింగ్స్ లో పోటాపోటీ ఉంటుందని అభిమానులు భావించారు. అంచనాలకు భిన్నంగా కొన్‌స్టాస్‌ బూమ్రా వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ లో అద్భుతమైన బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వికెట్ పడినప్పుడు సాధారణ సెలబ్రేషన్స్ కే పరిమితమయ్యే బూమ్రా ఈ సారి మాత్రం కొన్ స్టాస్ తరహాలోనే ఇప్పుడు అరవమంటూ ప్రేక్షకులకు సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అటు సిరాజ్ సైతం లబుషేన్‌ వికెట్‌ తీసినప్పుడూ కొన్ స్టాస్ తరహాలోనే అభిమానులను అరవండంటూ ప్రోత్సహించాడు. ఉస్మాన్‌ ఖవాజాను క్లీన్‌బౌల్డ్‌ చేసిన తర్వాత మాత్రం సిరాజ్‌ సైలెంట్‌ అంటూ సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed