తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Mahesh |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తెల్లవారుజామున తిరుమల తిరుపతి(Tirumala Tirupati)లో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన వెంగమాంబ అన్నదాన సత్రం(Vengamamba Annadana Satram)లో భోజనం చేశారు. అనంతరం సత్రంలోని భోజనంపై తన అభిప్రాయాలను అక్కడే ఉన్న రికార్డుల్లో డిప్యూటీ సీఎం భట్టి రాశారు. కాగా ఈ రోజు తెల్లవారుజామున మరోసారి శ్రీవారిని దర్శించుకున్న భట్టి.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆయనతో టీటీడీ అధికారులు ముచ్చటించారు. అలాగే ఆలయ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed