- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Formula E-Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ దూకుడు.. విచారణకు హాజరుకానున్న ఆ ఇద్దరు
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కారు రేసు (Formula-E Car Race) కేసులో ఈడీ దూకుడుగా వెళ్తోంది. మనీ లాండరింగ్ (Money Laundering), ఫెమా నిబంధనల (FEMA Regulations)ను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు ఈడీ (Enforcement Directorate) అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్ (KTR)తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (Aravind Kumar), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy)లకు కూడా ఈడీ (ED) నోటీసులు అందజేసింది.
ఈ నేపథ్యంలోనే రేపు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హజరుకానున్నట్లుగా తెలుస్తోంది. మరో అధికారి బీఎల్ఎన్ రెడ్డి కూడా ఎల్లుండి విచారణకు రానున్నారు. చివరగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఈనెల 7న ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. వాళ్లు ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండటంతో వాళ్లు ఏం చెబుతారా.. అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.