Prabhas: అభిమానులకు న్యూయర్ విషెష్ తెలిపిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

by Anjali |
Prabhas: అభిమానులకు న్యూయర్ విషెష్ తెలిపిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్(Pan India star Prabhas) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో అనేక చిత్రాల్లో నటించి.. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు.ఇప్పటివరకు రెబల్ స్టార్ నటించిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. ప్రభాస్ కథానాయకుడిగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి(Baahubali) సినిమాతో అయితే ప్రభాస్ క్రేజ్ రెట్టింపు అయిందనడంలో అతిశయోక్తిలేదు. అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్టింగ్ లో బుజ్జిగాడు(Bujjigadu), డార్లింగ్(Darling), ఈశ్వర్(Ishwar), వర్షం(Varsha), చత్రపతి(Chatrapati), మిర్చి(Mirchi) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

చివరగా సలార్(Salar), కల్కి 2898 (Kalki) సినిమాల్లో నటించారు. ప్రస్తుతం స్పిరిట్(Spirit), రాజాసాబ్(Rajasab) సినిమాల్లో నటిస్తున్నారు. ఇకపోతే నేడు కొత్త సంవత్సరం కాబట్టి సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో హ్యాపీ న్యూయర్ అంటూ అభిమానులకు విషెష్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్ కు ‘హ్యాపీ న్యూయర్ 2025’ అని ఇన్‌స్టా వేదికన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కాగా అభిమానులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed