Sai Pallavi: పెళ్లి జరిగి మూడు నెలల.. మొదట నా మనసు ఒప్పుకోలేదు.. సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
Sai Pallavi: పెళ్లి జరిగి మూడు నెలల.. మొదట నా మనసు ఒప్పుకోలేదు.. సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల ఆమె ‘అమరన్’(Amaran) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో సాయి పల్లవి నటనకు ఎంతోమంది మంత్రముగ్దులు అయ్యారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు నాగచైతన్య(Naga Chaitanya) సరసన ‘తండేల్’(Thandel ) సినిమాలో నటిస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సాయి పల్లవి ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

తన చెల్లి పెళ్లి జరిగి మూడు నెలల కావడంతో ఫొటోలు షేర్ చేస్తూ ‘‘నా సోదరి పెళ్లి కూడా నా జీవితంలో తదుపరి దశ అవుతుంది. ఈ వేడుకకు వచ్చినవాళ్ల ఆశీర్వాదాలు, కన్నీళ్లు, డ్యాన్స్ ప్రతీదానికి నేను సాక్ష్యంగా నిలిచాను. పూజ వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు మొదట నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇదంతా కొత్తగా అనిపించింది. అప్పుడు ఆమెకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వలేకపోయాను. కానీ నా మనసులో మాత్రం వినీత్(Vineeth) నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడన్న నమ్మకముంది. మీ పెళ్ళయి మూడు నెలలవుతోంది. నేను అనుకున్నట్లుగానే తన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. మీ జంటపై ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed