Loan EMI: లోన్ ఈఎంఐ కట్టడం ఆలస్యమవుతుందా.. అయితే ఇలా చేయండి..!

by Maddikunta Saikiran |
Loan EMI: లోన్ ఈఎంఐ కట్టడం ఆలస్యమవుతుందా.. అయితే ఇలా చేయండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చాలా మంది తమ ఆర్థిక అవసరాలను(Financial Needs) తీర్చుకునేందుకు రుణాలపై(Loans) ఆధారపడుతున్నారు. హౌస్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ ఇలా తదితర లోన్స్ తీసుకుంటున్నారు. కాగా ఈ లోన్ రి పే(Re Pay) చేయడానికి నెలవారీ వాయిదాల్లో చెల్లించే సదుపాయం ఎంచుకుంటున్నారు. అయితే డబ్బులు అడ్జస్ట్(Adjust) అవ్వకపోవడం లేదా ఇతరత్రా కారణాల(Other Reasons) వల్ల కొన్ని సార్లు మనం తీసుకున్న లోన్‌కు ఈఎంఐ(EMI) కట్టడం ఆలస్యం అవుతుంటుంది. అలాంటి సమయంలో కొన్ని మార్గాలు పాటించాలి. సరైన సమయానికి లోన్ చెల్లించలేకపోతే వెంటనే లోన్ తీసుకున్న బ్యాంకు(Bank) లేదా ఫైనాన్స్(Finance) కంపెనీలకు తెలపాలి. కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలి. ఈఎంఐ లిమిట్ తగ్గించడం, చెల్లింపు వ్యవధిని పెంచుకోవడం లాంటివి చేయాలి. కాగా ఈఎంఐ లేట్ పే చేస్తే బ్యాంకులు పెనాల్టీ(Penalty) విధిస్తాయి. దీంతో పెనాల్టీ మాఫీ చేయమని బ్యాంకును కోరాలి. అలాగే మరో లోన్ తీసుకుని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఈ విధంగా మనం తీసుకున్న లోన్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed