- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Army:ఈ ఏడాదిలో 75 మంది ముష్కరులు హతం.. పాక్ ఉగ్రవాదులే అధికం
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 75 మంది ఉగ్రవాదులను ప్రాణాలకు తెగించి భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ ముష్కరుల్లో ఉగ్రవాదుల్లో 60 శాతం మంది పాకిస్థాన్‌కు(Pakistan terrorists) చెందినవారేనని ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాదిలో ప్రతి ఐదురోజులకు ఒక టెర్రరిస్ట్‌ను, మొత్తంగా 75 మంది టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టామని తెలిపారు. వారిలో అధిక శాతం పాక్ ముష్కరులు ఉన్నట్లు నిర్ధారించారు. . నియంత్రణ రేఖ (Line of Control),ఇంటర్నేషనల్ బోర్డర్ (IB) దగ్గర 17 మంది, జమ్ముకశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో 26 మందిని హతమార్చారు.
ఐదుజిల్లాల్లోనే 42 మంది
జమ్ము ప్రాంతంలోని ఐదు జిల్లాలు-జమ్ము, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరిలో మరణించిన 42 మందిలో స్థానికేతర ఉగ్రవాదులు ఎక్కువ మంది ఉన్నారని డేటా వెలుగులోకి వచ్చింది. స్థానికేతర కశ్మీర్ లోయలోని బారాముల్లా, బందిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. జమ్ముకశ్మీర్‌లోని తొమ్మిది జిల్లాలలో బారాముల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్‌కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో అత్యధికంగా ఉరీ సెక్టార్‌లోని సబురా నాలా ప్రాంతం, మెయిన్ ఉరి సెక్టార్, కమల్‌కోట్ ఉరి నియంత్రణ రేఖ వెంబడి, చక్ తప్పర్ క్రిరి, నౌపోరా, హడిపొర, సాగిపోరా, వాటర్‌గామ్, రాజ్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ముష్కరులను ఆర్మీ జవాన్లు హతమార్చారు. అంతేకాకుండా ఉగ్ర కార్యకలాపాలు పెరగకుండా భద్రతాబలగాలు ముఖ్యపాత్ర పోషించాయి. అందుకే, జమ్ముకశ్మీర్ లో పనిచేస్తున్న స్థానిక ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇక, ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో 60 ఉగ్రదాడి ఘటనల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బందితో సహా మొత్తం 122 మంది చనిపోయారు.