- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Police: న్యూఇయర్ వేడుకలపై ఏపీ పోలీసుల ఆంక్షలు ఇవే..
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andrapradesh) లో న్యూఇయర్ వేడుకలపై(New Year celebrations) పోలీసుల ఆంక్షలు(Police restrictions) విధించారు. ఈ మేరకు సీపీ రాజశేఖర్ బాబు(CP Rajashekar Babu) కొత్త సంవత్సరం వేళ పాటించాల్సిన నిబంధనలను ఓ ప్రకటనలో తెలియజేశారు. విజయవాడలో(Vijayawada) డిసెంబర్ 31న రాత్రి ఫ్లైఓవర్లు, పశ్చిమ బైపాస్‌పై ట్రాఫిక్ నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక బందర్, ఏలూరు, బీఆర్టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక బెంజ్ సర్కిల్, కనకదుర్గా ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్, అసభ్య ప్రవర్తనలను అడ్డుకోవడానికి ప్రత్యేక బలగాలను నియమించినట్లు తెలియజేశారు. మధ్యం తాగి రోడ్ల మీదికి వస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యూయర్ సందర్భంగా వేడుకలు జరుపుకోవాలనుకుంటున్న యువత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు విజ్ఞప్తి చేశారు.