వీడు అసలు తండ్రేనా.. కన్న కూతురనే అలా చేస్తాడా..

by Sumithra |   ( Updated:2021-10-25 09:58:58.0  )
వీడు అసలు తండ్రేనా.. కన్న కూతురనే అలా చేస్తాడా..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు తనమన బేధం లేకుండా ఆడదైతే చాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. పదకొండేళ్ల బాధితురాలు మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండేది. ఆ అమ్మాయి స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 24న అమ్మాయి తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులకు తెలిపింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని రిమాండ్ తరలించి బాలికను భరోసా కేంద్రానకి పంపారు.

Advertisement

Next Story