- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మౌలాలిలో డేటా పునరుద్ధరణ కేంద్రం.. అత్యవసర పరిస్థితుల్లో చాలా అవసరం
దిశ, తెలంగాణ బ్యూరో: మౌలాలిలో విపత్కర పరిస్థితుల్లో తాత్కాలికంగా డేటా పునురుద్ధరణ కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. సికింద్రాబాద్‌లోని ప్రయాణికుల రిజర్వేషన్ కాంప్లెక్స్ (పీఆర్‌ఎస్) వద్ద తనిఖీలు నిర్వహించారు. ఇండియన్ రైల్వే క్లౌడ్ సెంటర్ పురోగతిని సమీక్షించారు. డేటా సెంటర్‌ను ఆయన పరిశీలించి, యంత్ర పరికరాలు, డేటా సర్వర్ గది, డేటా పరికరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరిత్యాలతో, పరికరాల వైఫల్యం పరిస్థితులలో ప్రయాణికుల రిజర్వేషన్ టికెటింగ్ సిస్టంకు ఆటంకాలు కలగకుండా సజావుగా సాగేలా చూడడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అన్నారు.
డేటా స్టోరేజి, డేటా నకలు విపత్కర పరిస్థితులలో డేటా పునరుద్ధరణ మరియు క్లౌడ్ సెంటర్ కార్యకలాపాలు ఆధారపడుతాయన్నారు. ప్రధాన సర్వర్లకు ఆటంకాలు ఏర్పడితే, తాత్కాలిక డేటా పునరుద్ధరణ కేంద్రం ద్వారా డేటాను తిరిగిపొంది తిరిగి సర్వర్ ప్రారంభమయ్యే వరకూ ప్రయాణికుల టికెటింగ్ సిస్టంలో ఆటంకాలు లేకుండా సజావుగా కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ కేంద్రం ఎంతో తోడ్పడుతుందన్నారు. ప్రస్తుత డిజిటలైజేషన్ పరిస్థితులలో క్లౌడ్ స్టోరేజీ మరియు డేటా పునరుద్ధరణ కేంద్రాల అత్యవసర ఆవశ్యకత చాలా ఉందని, ప్రకృతి వైపరిత్యాల అవకాశాలు తక్కువుగా ఉండే హైదరాబాద్ నగరం డేటా పునరుద్ధరణ కేంద్రానికి అనువైన ప్రదేశమని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే సిస్టమ్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె.ఆర్.కె రెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఎ.కె.గుప్తా, హైదరాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రాయన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.