దళిత బాలికను బడిలోకి లాక్కెళ్లి అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో..

by Sumithra |
Repe
X

దిశ, వెబ్‌డెస్క్ : పరిచయం ఉంటే చాలు.. కామ కోర్కెలు తీర్చుకోవడానికి తహతహలాడుతున్నారు కామాంధులు. వయసు, వరసలు కూడా చూడకుండా కబలిస్తున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. అదును చూసి కాటేస్తున్నారు. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఇలాంటి పిశాచాలు చెలరేగిపోతున్నారు. ఒంటరిగా ఇంటి బయట ఉన్న బాలికను పాఠశాలలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో కీచకుడు. విద్యా బుద్దులు నేర్చుకున్న బడిలోనే బలత్కారానికి పాల్పడి నీచానికి ఒడిగట్టాడు ఈ ప్రబుద్దుడు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రవి వెల్లడించారు.

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దళిత బాలిక (16) తన అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన పగిళ్ల సందీప్ (21) ఆ బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గ్రామంలో పండగ జరుగుతుండగా.. బాలిక ఇంటి బయటకు వచ్చింది. అప్పటికే బాలికను గమనిస్తున్న సందీప్.. బయట ఒంటరిగా ఉన్న ఆమెను బలవంతంగా సమీపంలోని పాఠశాలలోకి లాక్కెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం బాలిక ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు గమనించి ఏం జరిగిందని నిలదీశారు. దీంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మద్దిరాల పోలీస్ స్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయి ప్రశాంత్ కేసు నమోదు చేసి, సందీప్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story