టీడీపీకే మా మద్దతు: పురంధేశ్వరి

by Anukaran |   ( Updated:2020-07-04 05:38:37.0  )
టీడీపీకే మా మద్దతు: పురంధేశ్వరి
X

దిశ, అమరావతి: అమరావతి విషయంలో పాత ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగించాలని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయమని ఆమె తెలిపారు. అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధితో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. అమరావతి కోసం పోరాడుతున్న వారంతా మహనీయులని కొనియాడారు. 3 రాజధానులు అంటూ వైసీపీ నేతలు చాలా తెలివిగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం రాక్షస క్రీడ ఆడుతోందని మండి పడ్డారు. అమరావతి కోసం మహిళల ఉద్యమం ప్రశంసనీయమన్నారు. అమరావతికి బీజేపీ ఎప్పుడూ మద్దతు పలుకుతుందని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.

Advertisement

Next Story