- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుమన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం
దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటనతో దక్షిణాదిన తనదైన ముద్ర వేసుకున్న నటుడు సుమన్‌కు అరుదైన గౌరవం లభించింది. భారతదేశంలో సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఆదివారం ముంబై నగరంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌కు ఈ గౌరవం లభించింది. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ ఈ అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం అందుకోవడం పట్ల సుమన్ ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సుమన్ కృతజ్ఞతలు చెప్పారు.
కాగా, కర్ణాటకకు చెందిన సుమన్ యాక్షన్ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు. హీరోగా, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. మరీ ముఖ్యంగా తెలుగులో అన్నమయ్య చిత్రంలో ‘వేంకటేశ్వరస్వామి’ పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా కనిపించి తన సత్తా ఏంటో నిరూపించారు. అంతేగాకుండా.. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘శివాజీ’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి విలన్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.