ఆ ఫోటోగ్రాఫర్ కోసం నగ్నంగా మారిన స్టార్ హీరోయిన్లు.. ఫోటోలు వైరల్

by Anukaran |   ( Updated:2021-06-22 07:16:00.0  )
daboo ratnani photoshoot
X

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న కాలాన్ని బట్టి చిత్రపరిశ్రమ కూడా మారుతుంది. ఎప్పటికప్పుడు కొత్త రంగులను పులుముకుంటుంది. ఇక చూసే ప్రేక్షకుడు సైతం వాటికి అనుగుణంగానే మారుతున్నాడు. ఒకప్పుడు హీరోయిన్ నగ్నంగా నటించాలంటే జంకేవారు. కానీ ఇప్పుడు పాత్ర డిమాండ్ చేయాలి కానీ సినిమా మొత్తం నగ్నంగా నటించామన్నా ఓకే అంటున్నారు. నగ్నత్వం అనేది ఒకప్పుడు ప్రైవసీ.. కానీ ఇప్పుడు అది పబ్లిసిటీ. సినిమాల్లోనే కాదు ఫోటోషూట్ లలో సైతం నగ్నంగా కనిపించడానికి సై అంటున్నారు. ఇక ఫోటోషూట్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు డబూ రత్నానీ. దేశవ్యాప్తంగా గొప్ప పాపులారిటీ ఉన్న డబూ రత్నానీ క్యాలెండర్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రతి యేటా ఈ క్యాలెండర్ లో బాలీవుడ్ హీరోయిన్ లు నగ్నంగా దర్శనమిస్తారు. ఇక రత్నానీ క్యాలెండర్ కోసం ఇప్పటివరకు నగ్నంగా దర్శనమిచ్చిన హీరోయిన్లు ఎవరంటే..

విద్యాబాలన్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన విద్యాబాలన్ ఎంత బోల్డ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాడీ షేమింగ్ గురించి, తానూ ఎదుర్కున్న అవమానాల గురించి ఏకరువు పెట్టిన ఈ భామ డబూ రత్నానీ క్యాలెండర్ కోసం అర్ధనగ్నంగా ఫోజిచ్చింది. ఒంటి మీద నూలుపోగు లేకుండా సున్నం రాసుకొని కైపెక్కించే లుక్ లో కవ్విస్తోంది. ఇక ఈ ఫోటో అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపింది. ఆ తర్వాత విద్య బలం పలుమార్లు క్యాలెండర్ లో బోల్డ్ లుక్ లో మెరిసి మెప్పించింది.

సన్నీ లియోన్: ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఐటెం సాంగ్ లకు క్వీన్ గా మారిపోయిన సన్నీ డబూ రత్నానీ క్యాలెండర్ పై పలుమార్లు నగ్న దేహంతో కనిపించి అభిమానులకు ఊపిరాడనీయకుండా చేసింది. ఒకసారి తన అందమైన దేహాన్ని బుక్ తో కవర్ చేసి కనిపించగా.. మరోసారి తన ఎద భాగాలను పెద్ద టోపీతో కప్పేసి కవ్వించింది. ఇక సన్నీ ఈ రేంజ్ లో కనిపిస్తే కురాళ్ళ హీట్ ఎక్కకుండా ఉంటారా..? వెంటనే ఈ ఫోటోలను వైరల్ గా మార్చేశారు.

కృతి సనన్: వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కృతి ఆ సినిమా పరాజయం పాలవడంతో టాలీవుడ్ కి దూరమైందనే చెప్పాలి. మధ్యలో దోచేయ్ చిత్రంలో మెరిసినా అది కూడా అమ్మడికి నిరాశనే మిగిల్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ ఆది పురుష్ లో ప్రభాస్ సరసన సీత గా నటిస్తుంది. ఇకపోతే అమ్మడు సైతం డబూ రత్నానీ క్యాలెండర్ కోసం ఫోజిచ్చింది. సెమీ న్యూడ్ గా కనిపించి రచ్చ లేపింది. చిరుగులు జీన్స్ పైన అందమైన ఎద అందాలను టోపీతో కప్పేసినా నాభి అందాలను మాత్రం ఎరగా వేసి కత్తిలాంటి చూపులతో చంపేసింది.

కియారా అద్వానీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో ఒకరిగా కొనసాగుతున్న కియారా తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఎప్పుడు సోషల్ మీడియాలో ఏక్టివ్ గా ఉంటూ తన అందాలను దాచుకోకుండా ఎరవేసి ఈ భామ డబూ రత్నానీ క్యాలెండర్ కోసం కూడా తగ్గేదే లే అన్నట్లు కనిపించింది. గతేడాది అరటి ఆకు వెనక నగ్న దేహంతో నిలబడి ఉన్న ఫోటో ఇప్పటికే వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది అంతకు మించి అన్నట్లు బీచ్ లో ఇసుక తిన్నెలపై ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా పడుకొని కిల్లర్ లుక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

దిశా పటానీ: తన అందాలను ఇంచి కూడా దాచుకోకుండా ఎప్పటికప్పుడు అభిమానుల మతులను పోగొట్టే హీరోయిన్ దిశా పటానీ. సీకే బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా లో దుస్తుల్లో మెరిసిన ఈ భామ డబూ రత్నానీ క్యాలెండర్ లో సైతం తన పంథాను వదలలేదు. అర్దనగ్నంగా ఎద అందాలకు చేతులు అడ్డుపెట్టి తీక్షణంగా చూస్తూ కైపెక్కిచింది. ఇక వీరితో పాటు అలియా భట్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, టబు, కరీనా కపూర్, తారా సుతారియా, జాక్వలిన్ పెర్నాండజ్, భూమి పెడ్నేకర్ లాంటి స్టార్ హీరోయిన్లందరూ డబూ రత్నానీ క్యాలెండర్ లో నగ్నంగా దర్శనమిచ్చి కనువిందు చేసినవారే. ఇప్పటికీ ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి.

Advertisement

Next Story