- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్షన్ టెన్షన్.. డీ ఫ్లోరైడ్ కట్ట తెగితే మిగిలేవి కన్నీళ్లే..
దిశ, ఖానాపూర్ : రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ సమీపంలో గల డీ ఫ్లోరైడ్ రిజర్వాయర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పరిమితికి మించి వరద నీరు చేరటంతో రిజర్వాయర్ చుట్టూ ఉన్న కట్ట తెగే అవకాశం ఉంది.
ఒకవేళ అదే జరిగితే వరద నీటి ప్రవాహం వలన దిగువనున్న అశోకనగర్, అయోధ్య నగర్ గ్రామాలకు ప్రమాదం పొంచి ఉన్నది. కట్ట తెగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి నీటిని మళ్లీస్తే వరద ప్రవాహానికి గురికాకుండా ఉంటామని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఎమ్మెల్యే రాక :
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డీ ఫ్లోరైడ్ రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.