బిగ్ బాస్5 విన్నర్‌ సన్నీకి తప్పిన ప్రమాదం.. ఊపిరిపీల్చుకున్న ఫ్యాన్స్

by Shyam |   ( Updated:2021-12-22 00:04:43.0  )
బిగ్ బాస్5 విన్నర్‌ సన్నీకి తప్పిన ప్రమాదం.. ఊపిరిపీల్చుకున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. 19 కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణంలో చివరికి విజయం సన్నీని ఆహ్వానించింది. సన్నీ విజయంతో తన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇక హౌస్‌లో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఓర్పుతో ప్రతీది సర్దుకుంటూ చివరకు విన్నర్‌గా నిలిచిన సన్నీ ప్రస్తుతం వరస ప్రెస్ మీట్స్‌తో బిజీ అయిపోయారు. అయితే తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో సన్నీకి అనుకోని పరిణామం ఎదురైంది. ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో అక్కడున్నవారు మొబైల్‌లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇక ఈ ప్రమాదంలో సన్నీకి ఏం కాకపోవడంతో తన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story