ఉద్యోగాల భర్తీకి సీఎస్ కసరత్తు

by Shyam |
ఉద్యోగాల భర్తీకి సీఎస్ కసరత్తు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌‌ సోమేశ్‌‌ కుమార్‌‌ను సీఎం కేసీఆర్​ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సీఎస్ సోమేశ్ కుమార్ వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించి, వెంటనే నోటిఫికేషన్ల విడుదల చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. ఖాళీల వివరాలపై సోమవారం వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని శాఖల్లో ప్రక్షత్య నియామకాల ద్వారా 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఖాళీలపై పూర్తి వివరాలతో త్వరలోనే సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story