- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థర్డ్ వేవ్‌పై సీఎస్ సోమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు
దిశ, ఖైరతాబాద్: రాష్ట్రంలో థర్డ్ వేవ్ రాదని భావిస్తున్నామని, అదే సమయంలో ఏ విధమైన సంఘటనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్ వార్డు పరిధిలోని సిపిఐ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ శర్మన్ లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహానగర పరిధిలోని, బస్తీలలో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా వంద శాతం అర్హులైన వారికి వ్యాక్సిన్ పూర్తి చేసే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మహా నగరంలో కొనసాగుతుందని చెప్పారు. ఇంటిలో నివసించే అందరికీ వ్యాక్సిన్ పూర్తయితే వ్యాక్సిన్ పూర్తయిందని స్టిక్కర్లు అతికిస్తున్నట్లు తెలిపారు. ఇదే తరహాలో మొత్తం కాలనీ లేదా బస్తీలో 100% వ్యాక్సిన్ పూర్తయితే కార్యక్రమాలకు ప్రత్యేక ప్రశంస పత్రాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అందజేస్తామని చెప్పారు.