ఈటల‌ రాజేందర్‌ మాకు క్షమాపణ చెప్పాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

by Sridhar Babu |   ( Updated:2021-09-06 10:51:31.0  )
ఈటల‌ రాజేందర్‌ మాకు క్షమాపణ చెప్పాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
X

దిశ, జమ్మికుంట: దళిత బంధును చూసి ఓర్వలేకనే.. వేరే వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, గువ్వల బాలరాజు, ఆరూరి రమేష్‌లు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వారు.. ఈటల రాజేందర్ వెంటనే దళిత ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా మాట్లాడుతున్న ఈటల.. గెలిచిన తర్వాత వ్యవహార శైలి ఎలా ఉంటుందో సమాజం గమనించాలని.. ఓడిపోతాననే అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలంతా శాంతియుతంగా ఉన్నారని, మేము మాట్లాడితే బీజేపీ వాళ్లు తట్టుకోలేరని.. ఇప్పటికైనా వారి వైఖరి మార్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, గువ్వల బాలరాజు, ఆరూరి రమేష్‌లు మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed