చెల్లి పెళ్లికి అడ్డం వస్తున్నాడనే నెపంతో..

by Sumithra |
చెల్లి పెళ్లికి అడ్డం వస్తున్నాడనే నెపంతో..
X

దిశ, వరంగల్ :
తన చెల్లిని ప్రేమిస్తూ, పెళ్లికి అడ్డం వస్తున్నాడనే నెపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆటోతో గుద్ది, కత్తితో పొడిచి చంపాడో అన్న..హత్య అనంతరం పరారీలో ఉన్ననిందితుడిని అరెస్టు చేసి శనివారం మీడియా సమావేశంలో జనగామ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి ప్రవేశ పెట్టి, వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పేర్నె శ్రీధర్ హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా 45 రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. తనతో కలిసి చదువుకున్న స్నేహితురాలిని కలిసేందుకు కొడవటూర్ గ్రామానికి వెళ్లాడు. అప్పటికే తన చెల్లికి పెళ్లి చేసేందుకు శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలోనే శ్రీధర్ రావడంతో తన చెల్లి పెళ్లి ఎక్కడ చెడిపోతుందోనని భయపడ్డ అన్న ఎలాగైనా అతన్నితప్పించాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే శుక్రవారం శ్రీధర్ టీఎస్ 08 జీవై 0956 నెంబర్ గల పల్సర్ బైక్ పై కొడవటూర్ కమాన్ వద్దకు చేరుకోగానే అప్పటికే పక్కా ప్లానింగ్‌తో ఉన్న శివకుమార్ ఏపీ 36 టీఏ నెంబర్ గల ఆటోతో వేగంగా బైక్‌ను ఢీ కొట్టాడు. అతను కిందపడటంతో వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాధితుడిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి శ్రీధర్ ప్రాణాలు కోల్పొయాడు. హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అరగంటలోనే అరెస్టు చేసినట్టు డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఏసీపీ వినోద్ కుమార్, సీఐ మల్లేషం, ఎస్సైలు, కానిస్టేబుల్ ఉన్నారు.

Advertisement

Next Story